Bigg Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో తెలుగు హీరోయిన్.. తనతో పాటు వీరు కూడా..
Bigg Boss Non Stop: తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలయ్యింది.;
Bigg Boss Non Stop: బిగ్ బాస్ షో అనేది భాష దాటి ఎప్పటికప్పుడు క్రేజ్‌తో అన్ని భాషల ప్రేక్షకులను చుట్టేస్తుంది. అందుకే మిస్ అవ్వకుండా ప్రతీ భాషలో ప్రతీ సంవత్సరం కొత్త సీజన్ మొదలవుతుంది. అలాగే బిగ్ బాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ హిందీ యాజమాన్యం ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ అనే విధానాన్ని స్టార్ట్ చేసింది. అదే త్వరలో తెలుగులో కూడా ప్రారంభం కానుంది. ఇక ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానుంది. అయితే మామూలుగా బిగ్ బాస్‌లో ఉండే రూల్స్ అన్ని బిగ్ బాస్ నాన్ స్టాప్‌కు కూడా ఉంటాయి. 100 రోజలు 17 మంది హౌస్‌మేట్స్.. బిగ్ బాస్ హౌస్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్‌మేట్స్ క్వారంటీన్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 26న గ్రాండ్ ఈవెంట్‌తో వీరంతా ప్రేక్షకులకు పరిచయమవుతారు.
అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలయ్యింది. కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ ఓటీటీ కోసం మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారన్న విషయం కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. అయితే తాజాగా హాట్‌స్టార్ ఒక ట్వీట్ చేసింది. ఒక నటి ఫోటోను మొహం తెలియకుండా పోస్ట్ చేసి తను ఎవరో కనుక్కోమని కొన్ని హింట్లు ఇచ్చింది హాట్‌స్టార్ టీమ్.
🚨 You got it right?
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 21, 2022
And here is our next mystery contestant! Read the post carefully and post your guess in the comments! #biggbossnonstop #biggboss #disneyplushotstar pic.twitter.com/FpKnaYm040
అయితే హాట్‌స్టార్ పోస్ట్ చేసిన ట్వీట్‌లో ఉన్న నటి బిందుమాధవి అంటూ ప్రచారం మొదలయిపోయింది. మామూలుగా ఫేడవుట్ అయిపోయిన నటీనటులు బిగ్ బాస్‌లాంటి అవకాశం వస్తే వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్‌లో కనిపించిన తర్వాత మరోసారి వారికి అవకాశాలు దక్కడం మొదలవుతుంది. అందుకే ఈ నటి బిందు మాధవినే అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మిగతా కంటెస్టెంట్స్ ఎవరంటే.. కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1 కంటెస్టెంట్), ఆదర్శ్ (సీజన్ 1 రన్నర్), ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెంట్), రోల్ రైడా (సీజన్ 2 కంటెస్టెంట్), తేజస్వి (సీజన్ 2 కంటెస్టెంట్),అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్), అరియానా గ్లోరి (సీజన్ 4 కంటెస్టెంట్),మహేశ్ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్), సరయు (సీజన్ 5 కంటెస్టెంట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్) నటరాజ్ మాస్టర్ (సీజన్ 5 కంటెస్టెంట్), ఒక యూట్యూబర్, యాంకర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, యూట్యూబ్ యాంకర్ శివ, చిచ్చా చార్లెస్, అజయ్ కతుర్వార్. వీరిలో ఎవరు బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కనిపిస్తారో తెలియాలంటే ఇంకా నాలుగు రోజులు వేచిచూడాల్సిందే..