మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా రాబోతోందని అందరికీ తెలుసు. అయితే ఈ మూవీకి సంబంధించి బుచ్చిబాబు చూపిస్తోన్న స్పీడ్ కే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అఫ్ కోర్స్ అతని స్పీడ్ కు హీరో సహకారం కూడా చాలా అవసరమే. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కు సంబంధించి రకరకాల టాపిక్స్ వినిపిస్తున్నాయి. మాగ్జిమం ఫ్లాప్ అంటున్నారు కొందరు. కావాలనే ఫ్లాప్ అయ్యేలా చేశారు అనేది మేకర్స్ వాదన. ఈ మూవీ ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఏపిలో ఓ లోకల్ ఛానల్ లో ప్రసారం కావడం చూస్తే అది నిజమే అనిపించినా.. ఒకప్పుడు అత్తారింటికి దారేదీ కూడా ఇలాగే లీక్ అయింది. అయినా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏదైనా కంటెంట్ డిసైడ్ చేస్తుందనేది నిజం.
అయితే రామ్ చరణ్ వరస చూస్తోంటే గేమ్ ఛేంజర్ పై వచ్చే వార్తలన్నీ లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు తన ఫోకస్ అంతా బుచ్చిబాబు మూవీపైనే ఉంది. ఇప్పటికే మేకోవర్ పూర్తయింది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మీర్జాపూర్ తో దేశవ్యాప్తంగా ఫేమ్ అయిన దివ్యేందు శర్మ ఈ మూవీతో సౌత్ కు పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ కు నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఓ అద్భుతమైన అప్టేట్ వినిపిస్తోంది.
మార్చి 27న ఈ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నారు. మరి ఆ డేట్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా..? యస్.. అది మెగా పవర్ స్టార్ బర్త్ డే. అంతే కాదు.. సినిమాను కూడా ఈ యేడాదే దసరా బరిలో రిలీజ్ చేయబోతున్నారట. ఇది చూసిన వాళ్లంతా ఈ దూకుడేంది బుచ్చీ అంటున్నారు. మరి అప్పుడే టీజర్, రిలీజ్ డేట్స్ తో రెడీగా ఉన్నాడంటే మనోడి ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థం కావడం లేదూ.?
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోన్న ఈ మూవీ రామ్ చరణ్ కు సోలోగా 1000 కోట్లు తెస్తుందని అంచనాలున్నాయి. అవి నిజం అవుతాయా లేదా అనేది టీజర్ చూస్తే కానీ కొంత వరకు ఓ ఐడియాకు రాలేం. ఏదేమైనా ఇదో పెద్ద బ్లాక్ బస్టర్ అని బుచ్చిబాబు మాత్రం చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటూ వస్తున్నాడు.