Chiranjeevi : విశ్వంభరకు లైన్ క్లియర్ అయిందా

Update: 2025-03-11 06:00 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విశ్వంభర. వశిష్ట దర్శకుడు. షూటింగ్ పూర్తయినా.. రిలీజ్ డేట్ విషయంలో మూవీ టీమ్ నుంచి క్లారిటీ లేదు. అందుకు కారణం సినిమాటోగ్రఫీ సరిగా లేని కారణంగా ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ క్వాలిటీతో చేయలేకపోతున్నారట. ఫిక్షనల్ ఫాంటసీ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రం అలనాటి జగదేకవీరుడు అతిలోక సుందరిని గుర్తుకు తెస్తుంది అని ముందే చెప్పారు. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ చూసి ఫ్యాన్స్ బెదిరిపోయారు. ఈ క్వాలిటీతో వస్తే అది ఆదిపురుష్ కంటే దారుణంగా ట్రోల్ అవుతుందన్నారు. కట్ చేస్తే ఈ మూవీకి ఇప్పుడు అవతార్ కు పనిచేసిన టీమ్ తో మళ్లీ విఎఫ్‌ఎక్స్ చేయిస్తున్నారు. అయినా సినిమాటోగ్రాఫర్ కు అవగాహన లేకోవడంతో వారకీ టఫ్ అవుతుందట. నిజానికి ఈ సినిమాటోగ్రాఫర్ 'కలర్ ఫుల్' ఫ్రేమ్స్ పెట్టగలడు కానీ.. ''క్లెవర్ ఫుల్" ఫ్రేమ్స్ పెట్టలేడు అని ఆయనతో పనిచేసిన చాలామంది దర్శకులు భావిస్తుంటారు. తను మాత్రం డోంట్ కేర్ టైప్.

ఇక సంక్రాంతి నుంచి సమ్మర్ వరకూ వచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్ సమ్మర్ ను కూడా దాటింది. కొత్త రిలీజ్ డేట్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజం కాబోతున్నాయి. ఈ మూవీని ఆగస్ట్ లో విడుదల చేస్తారు అనే మాటలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ డేట్ మెగాస్టార్ బర్త్ డేట్ కాబోతోంది అనేది ఎక్కువ మంది చెప్పిన మాట. ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే. అదే రోజు శుక్రవారం కూడా వస్తోంది కాబట్టి ఆ రోజు విశ్వంభరను విడుదల చేస్తారు అన్నారు. బట్ బర్త్ డే రోజున రిజల్ట్ తేడా వస్తే బ్యాడ్ డే అవుతుందనుకున్నారట. అందుకే ఆగస్ట్ 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ దాటితే మళ్లీ మంచి డేట్ రావడానికి టైమ్ పడుతుంది. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ లాస్ట్ వీక్ లో రావడానికే ప్రయత్నం చేస్తున్నారు.జూలై వరకు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ అంతా పూర్తవుతుంది. సో.. రిలీజ్ కు మంచి ప్రాపర్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు అనేది ప్లాన్.

ఇక విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 

Tags:    

Similar News