Puneeth Rajkumar : పునీత్ పుట్టినరోజు : 200 మందికి పైగా వృద్ధులకు భోజనం పెట్టిన విశాల్..!
Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా పునీత్ ఫ్రెండ్, నటుడు విశాల్ చెన్నైలోని పలు ఆశ్రమాలలో 200 మందికి పైగా వృద్ధులకు ఆహారాన్ని అందించారు.;
Puneeth Rajkumar : నిన్న (మార్చి 17 )దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా అభిమానులు చాలా మంది పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పునీత్ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా పునీత్ ఫ్రెండ్, నటుడు విశాల్ చెన్నైలోని పలు ఆశ్రమాలలో 200 మందికి పైగా వృద్ధులకు ఆహారాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియోని విశాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా పునీత్‌ని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు విశాల్.
Nothing else would make my dear friend @PuneethRajkumar more happy and proud on his bday than helping these lovely ones and it feels good to see all these elderly ppl bless him.#HBDPuneethRajKumar pic.twitter.com/G7TsUUTErJ
— Vishal (@VishalKOfficial) March 18, 2022
" హ్యాపీ బర్‌డే డియరెస్ట్ బ్రదర్ - పునీత్ రాజ్‌కుమార్... నువ్వు మా మధ్య లేకపోయినా, నీ ఆలోచనలు, నీ అమూల్యమైన చిరునవ్వు ఇప్పటికి మా హృదయాల్లో నిలిచి ఉన్నాయి. మేమందరం నిన్ను రోజూ కోల్పోతున్నాను. మీ జేమ్స్ చిత్రానికి నా శుభాకాంక్షలు. మా ప్రేమ, ఆప్యాయత, గౌరవాన్ని ఎప్పటికీ మీపై కురిపిస్తూనే ఉంటాము" అని విశాల్ ట్వీట్ చేశాడు. కాగా పునీత్ చివరి చిత్రం జేమ్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, కిషోర్ పత్తికొండ నిర్మాతగా వ్యవహరించారు.
Happy bday dearest brother @PuneethRajkumar.
— Vishal (@VishalKOfficial) March 17, 2022
Though u r nt amidst us, ur thoughts, ur precious smile n ur aura is still lingering in our hearts.
V do miss u everyday.
My bst wishes fr ur film James.
We wil alwys continue to shower our love,affection & respect to u fr evr. GB. pic.twitter.com/4mJOryLq0f
కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణాన్ని అభిమానులు ఎవ్వరు కూడా ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.