HIT-3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ రిలీజ్

Update: 2025-03-25 06:00 GMT

నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమాలో మొదటి సాంగ్ వచ్చింది. హిట్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పార్టు రాబోతోంది. శైలేష్ కొలను డై రెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెలోడీ క్లాసిక్ ఉన్న ఈ పాట చాలా ఆకట్టుకుంటోంది. నాని, శ్రీనిధి నడుమ లవ్ సాంగ్ గా ఇది వస్తోంది. 'ప్రేమ వెల్లువ' అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించారు. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. నాని, శ్రీనిధి కెమిస్ట్రీను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత వైలెంట్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.

Tags:    

Similar News