నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'హిట్': ది థర్డ్ కేస్, శైలేష్ కొలను దర్శకుడు. 'హిట్' సిరిస్ లో భాగంగా వస్తున్న మూడవ భాగం ఇది. వాల్ పోస్టర్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని. నాని యానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్ను ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్రతో పాటు మిగతా పాత్రల గురించి తెలియజేసేందుకు చిత్ర బృందం సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సంగీతం మిక్కే జే మేయర్, ఛాయాగ్రహణం సాను జాన్ వర్గీస్ అందిస్తున్నారు. మే ఒకటవ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.