బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రల్లో నటించిన మూవీ 'హోమ్ బౌండ్’, నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వంలో సామాజిక, రాజకీయ నేపథ్యం లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించ గా.. 9నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది. లేటెస్టుగా ముంబైకి చేరుకున్న జాన్వీ.. కేన్స్ విశేషాలను మీడియాతో పంచుకుంది. 'హోమ్ బౌండ్' నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 'కేన్స్’లో ప్రీమియర్ పూర్తయ్యే సమయానికి హాల్లో ఉన్న వారందరూ ఎమో షనల్అయ్యారు. దూరం నుంచి మా నాన్నను చూశా. ఎంతో బాధగా కనిపించారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన్ని నేనెప్పుడూ అలా చూడలేదు. నా సిస్టర్ ఖుషి పరిస్థితి కూడా సేమ్. ఆ టైంలో నేను వారి వద్దకు వెళ్తే.. తప్పకుండా నన్ను పట్టుకుని ఏడ్చేస్తారనిపించింది. ఇంత పెద్ద హాల్లో అంతమందితో కలిసి చూస్తుంటే నాక్కూడా కన్నీళ్లు వచ్చేశాయి. దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా 'ఇత్నా క్యో రో రహీ హై? (ఎందుకు అంతగా ఏడుస్తున్నావు?) అని నన్ను అడిగాడు. ఈమూవీ ప్రీమియర్ ను నేను లైఫ్తాం గుర్తు పెట్టుకుంటా' అని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది.