Deepika Padukone : జీవితంలో బ్యాలె న్స్ ఉండాలంటే నిజాయితే ముఖ్యం : దీపిక
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'స్పిరిట్'. అయితే ఇందులో హీరోయిన్ గా తొలుత దీపికనే అనుకొని, చివరి నిమిషంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. కాగా.. తన సినిమా స్టోరీని లీక్ చేస్తుందని సందీప్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు. డర్టీ పీఆర్మ్స్ అంటూ రెచ్చిపోయాడు. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక పదుకొణె ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్ ఉండాలంటే నిజాయితే ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. అయితే దీపిక పరోక్షంగా సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీపిక.. 'కల్కి 2' కోసం సిద్ధమవుతోంది. చివరగా 'సింగం ఎగైన్' లో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేం సైన్ చేయలేదు.