Rajinikanth : రజినీకాంత్ వేట్టైయాన్ ప్రీవ్యూ ఎలా ఉంది.

Update: 2024-09-21 10:00 GMT

జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అతనిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తోన్న రజినీ ఈ సారి వేట్టైయాన్ లా వస్తున్నాడు. అంటే వేటగాడు అని తెలుగు అర్థం. అయితే ఈ చిత్రానికి తెలుగులోనూ తమిళ్ టైటిల్ నే ఉంచేస్తున్నారు. ఈ శుక్రవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. సినిమాలో నోటెడ్ ఆర్టిస్టులు చాలామంది ఉండటంతో ఈ ఈవెంట్ కూడా కలర్ ఫుల్ గా జరిగింది. ఈ సందర్భంగా ప్రీ వ్యూ అంటూ విడుదల చేసిన టీజర్ లాంటి వీడియో ఆకట్టుుంటోంది.

దర్బార్ మూవీలో రజినీకాంత్ నటోరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. దానికి కొనసాగింపు అనేలా ఉందీ మూవీ. పోలీస్ ఆఫీసర్ గా నటించిన రజినీకాంత్ ఎంతోమందిని క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనిపై హ్యూమన్ రైట్స్ కమీషన్ విచారణ జరుగుతుంది.ఆ విచారణ అధికారిగా అమితాబ్ కనిపిస్తున్నాడు. ఈ టీజర్ ఎప్పట్లానే రజినీకాంత్ స్టైల్స్ ను ఎలివేట్ చేస్తూ కనిపించింది. క్రిమినల్స్ ఎన్ కౌంటర్స్ చేయడం అంటే హీరోయిజమా అంటూ అమితాబ్ డైలాగ్ కనిపిస్తోంది. కంటెంట్ ఇదీ అనే నిర్ధారణకు వచ్చేలా లేదు కానీ చాలా ప్రామిసింగ్ గా అయితే కనిపిస్తోంది.

జై భీమ్ మూవీతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న టి.జి జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. 33 యేళ్ల తర్వాత రజినీకాంత్, అమితాబ్ కలిసి నటించిన సినిమా కావడం విశేషం. ఇక రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతంది వేట్టైయాన్.

Tags:    

Similar News