యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్సరో అందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ తర్వాత ప్రపంచానికీ తెలిసింది. ఎలాంటి క్లిష్టమైన స్టెప్ అయినా రిహార్సల్ కూడా లేకుండా సులువుగా చేసేయడంలో ఎన్టీఆర్ లాంటి డ్యాన్సర్ మరొకరు లేరు అని అతనితో పనిచేసిన కొరియోగ్రాఫర్స్ అంతా చెబుతారు. రిహార్సల్ లేకున్నా రీ టేక్ అనే మాటే ఉండదంటారు. అయినా ఆర్ఆర్ఆర్ లో ఆ పాట కోసం అతనితోనూ రిహార్సల్స్ చేయించాడు రాజమౌళి. ఇద్దరి స్టెప్పులూ సింక్ అవ్వాలి. పర్ఫెక్షన్ ఉండాలి కదా. అలా ఇప్పుడు ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రిహార్సల్స్ టైమ్ లోనే గాయపడ్డాడు.. ఎన్టీఆర్ కాదు. హృతిక్ రోషన్.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 లో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు కదా. హృతిక్ కూడా గ్రేట్ డ్యాన్సరే. ఈ ఇద్దరి మధ్య కూడా ఈ మూవీలో ఓ పాట ఉందట. ఈ పాటను 500 మంది డ్యాన్సర్స్ తో చిత్రీకరిస్తారు అనే వార్తలు వచ్చాయి ఆ మధ్య. అయితే పాట కోసం రిహార్సల్స్ చేస్తుండగానే హృతిక్ రోషన్ కాలికి గాయం అయిందట. కాస్త పెద్ద గాయమే కావడంతో డాక్టర్స్ ఇప్పుడప్పుడే అంత క్లిష్టమైన స్టెప్పులు వేయొద్దు అని చెప్పడంతో పాటు ఆరు వారాల పాటు రెస్ట్ అవసరం అని చెప్పారట. దీంతో ఈ పాట చిత్రీకరణను మే నెలకు వాయిదా వేశారు. అదీ మేటర్.