ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ట్రైలర్ మరికొన్ని గంటల్లోనే రాబోతోంది. సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియా రేంజ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేసేలానే దేవర విజయం వరించింది. వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. అందుకే అతని పాత్ర ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి తెలుగు ఆడియన్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన అతని బర్త్ డే స్పెషల్ టీజర్ మాత్రం వెరీ ఇంప్రెసివ్ అనేశారు అంతా.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ న్యూస్ ఏంటంటే.. వార్ 2 డాల్బీ అట్మాస్ తో స్క్రీనింగ్ జరగబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ లో డాల్బీలో ప్రదర్శనలు ఉండబోతున్నాయి. దీని వల్ల ఆడియన్స్ కు డాల్బీ ప్రీమియమ్ సినిమా ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ సినిమాల విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వారికి ఆ ఎక్స్ పీరియన్ అందించేందుకే యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డాల్బీ అట్మాస్ ఆడియో వల్ల ప్యూర్ ఫీలింగ్ కలుగుతుందట. ఇంతకు ముందు కూడా ఈ టెక్నాలజీలో కొన్ని సినిమాలు విడుదలైనా.. అవి చాలా పరిమితంగానే ఉన్నాయి. బట్ ఫస్ట్ టైమ్ దేశవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో ఈ ఆడియో ఎక్స్ పీరియన్స్ తో వార్ 2 విడుదల కాబోతోంది. ఇక్కడే కాకుండా అటు వాల్డ్ వైడ్ ఆడియన్స్ కు కూడా ఇండియన్ సినిమా నుంచి ఇదో కొత్త అనుభూతిగా నిలుస్తుంది.
ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 ను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. ఇది ఇండియన్ ఏజెంట్స్ కు సంబంధించిన కథ అని ముందే చెప్పేశారు. నిజానికి యశ్ రాజ్ బ్యానర్ నుంచి కేవలం ఏజెంట్స్ కు సంబంధించిన కథలతోనే ప్రత్యేకంగా ప్రొడక్షన్ జరుగుతోంది. అందులో భాగంగానే గతంలో పఠాన్, జవాన్, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై వంటి మూవీస్ వచ్చాయి. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.