Vijay Jana Nayagan : విజయ్ మూవీకి భారీ డిజిటల్ రైట్స్

Update: 2025-04-02 07:30 GMT

దళపతి విజయ్ గా కోలీవుడ్ లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ మూవీ వస్తోందంటే కంటెంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తుంటాయి. తెలుగులో డిజాస్టర్ అనిపించుకున్న గోట్ చిత్రం కూడా అక్కడ ఏకంగా 450 కోట్లు వసూలు చేసిందంటే అదీ అతని రేంజ్ అని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా తెలుగులోనూ మంచి మార్కెట్ నే క్రియేట్ చేసుకున్న విజయ్.. కెరీర్ లో చివరి సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ అనే పార్టీని స్థాపించాడు. ఇకపై ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారేందుకే సినిమాలకు స్వస్తి చెబుతున్నాడు. ఈ క్రమంలో చివరగా చేస్తోన్న సినిమా ‘జన నాయగన్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ చిత్ర డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి.

ఓటిటి, శాటిలైట్ కలిపి జన నాయగన్ ఏకంగా 176 కోట్లకు అమ్ముడు పోయింది. ఓటిటి డీల్ ను అమెజాన్ సంస్థ 121 కోట్లకు దక్కించుకుంది. హిందీ కూడా ఇందులో భాగమే. కాకపోతే హిందీలో రెండు నెలల తర్వాతే స్ట్రీమ్ అవుతుందనే కండీషన్ ఉంది. ఇక శాటిలైట్ రైట్స్ ను సన్ టివి 55 కోట్లకు దక్కించుకుంది. విజయ్ చివరి సినిమా కావడం వల్ల ఇంతకంటే ఎక్కువ ధరకే రైట్స్ అమ్ముడవుతాయి అనుకున్నారు. బట్ విజయ్ కి కేవలం కోలీవుడ్ లో మాత్రం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండటం.. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటి వరకూ భారీ హిట్స్ లేకపోవడం వల్లే ఈ రేట్. అయినా కోలీవుడ్ లో ఇదే హయ్యొస్ట్ కావడం విశేషం.

కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం చేస్తున్నాడు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, శ్రుతి హాసన్, ప్రియమణి, మమిత బైజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా జన నాయగన్ విడుదల కాబోతోంది. 

Tags:    

Similar News