Samantha : తప్పులు చేశాను ఒప్పుకుంటున్నా! : సమంత

Update: 2024-11-06 13:15 GMT

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌ చేస్తోంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది సామ్. ఇదిలా ఉంటే తాజాగా సమంత త‌న సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూ అండ్ ఎ’ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఈ భామ సినిమాల్లో తన పాత్రల గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు మంచి పాత్రలే ఎంచుకోవడానికి ట్రై చేస్తా. గతంలో నా రోల్స్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. వాటిని ఒప్పుకుంటున్నా. ఇప్పుడు జాగ్రత్తపడుతున్నా" అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News