Harish Shankar : ఆమె సక్సెస్ వెనుక నేను : హరీష్ శంకర్

Update: 2024-08-08 04:45 GMT

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్ ( Mr. Bachchan). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఓ ఫొటోలో హీరోయిన్ వెనుకాల నడుచుకుంటూ వస్తున్నాడు హరీశ్ శంకర్. ఈ ఫొటోను ఉద్దేశించి 'ప్రతి అమ్మాయి విజయం వెనుక ఓ మగాడు ఉన్నాడని ఈ ఫొటో ప్రూవ్ చేస్తోంది. అందుకే భాగ్యశ్రీ వెనుకాల నేనున్నాను.' అని రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో తన లుక్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది భాగ్యశ్రీ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమా రిజల్ట్ పై టీమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నందున, వారు ఆగస్టు 14న పెయిడ్ ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవితేజ నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తాడని తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, సినిమా సెకండాఫ్లో సిద్ధు జొన్నలగడ్డ ఫైట్ సీక్వెన్స్లో కనిపిస్తాడు. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సిద్దు క్యామియో ఉంటుందని అంటున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

Tags:    

Similar News