తమిళ నటి శ్రియా రెడ్డి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆమె తెలుగులో సలార్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆమెకు సూపర్ హిట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీలో చేస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. "ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో చేయడం నా అదృష్టం. నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక పవన్ గారు చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి. ఎంతో హుందాగా ఉంటారు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి" అంటూ చెప్పుకొచ్చారు. సుజీత్ తెరకెక్కితున్న ఓజీ సినిమా 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.