Vidya Balan : ఎలాంటి పాత్రలో నైనా ఒదిగిపోతా : విద్యాబాలన్

Update: 2025-02-19 11:45 GMT

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ అందరికీ సుపరిచితమే. 2003లో బాల్ థేక్ అనే బెంగాలీ చిత్రంలో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఆ తర్వాత 2011 వరకు బెంగాలీ సినిమాల్లోనే యాక్ట్ చేసింది. అదే సంవత్సరం మలయాళ సినిమా ఉరిమిలో ఓ అతిథి పాత్రలో నటించిందీ అమ్మడు. 2011లో సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్స్ లో నటించింది. ఈ సినిమా విద్యాబాలన్ కెరీర్ ను మలుపు తిప్పింది. 2012లో సిద్ధార్థ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు కెరీర్ ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. తాజాగా `భూల్ భూలైయా 3'లో విద్యాబాలన్ తన అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన బాలన్.. తన పాత్రలో ఒదిగిపోతానని చెబుతోంది. అందుకు తగిన కాస్ట్యూమ్స్ నే ప్రిఫర్ చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విద్యాబాలన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఈ అమ్మడి వరుస ఫొటోషూట్లు నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఈ బ్యూటీ తదుపరి ఏ సినిమాలో నటిస్తోంది అనేది అటుంచితే, ఇప్పటికి ఘాటైన ఫోటోషూట్లను షేర్ చేస్తూ యూత్ తన బోల్డ్ ఇమేజ్ ని కాపాడుకుంటోంది. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు నెట్లో వైరల్ గా మారుతోంది.

Tags:    

Similar News