నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది. యానిమల్, పుష్ప, ఛావా వంటి చిత్రాలతో డబుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకుంది. ఈ మూడు సినిమాలతో అమ్మడు బా క్సాఫీస్ క్వీన్ అయిపోయింది. ఇటీవల విడుదలైన సికిందర్ సినిమాలోనూ అలరించింది. ప్రసుత్తం ఈ భామ 'కుబేర', 'థమ్' వంటి చిత్రాల్లో నటి స్తోంది. కాగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ రెగ్యూలర్ గా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజాగా రష్మిక ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్ డే మంత్. అందుకే నేను చాలా ఉత్సాహంగా ఉన్న. వయస్సు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజును జరుపుకోవడానికి చాలా మందికి ఆసక్తి ఉండదు. ఇది నేను ఎప్పటినుంచో వింటూనే ఉన్న. కానీ నా విషయంలో అలా మాత్రం కాదు. పెద్దయ్యాక కూడా బర్త్ డే చేసుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్త. నాకు 29 ఏండ్లు వస్తున్నాయంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇప్పుడు జరుపుకోబోతున్న ఈ పుట్టినరోజు నాకెంతో విలు వైనది' అంటూ రష్మిక పేర్కొంది.