సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం బిజీ బిజీగానే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ క్యారెక్టర్ ను చేసేందుకు ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఐటెం సాంగ్స్ నటించేందుకు రెడీ అంటుంది. మరోవైపు సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటి స్తుంది. ఇక శృతి ప్రభాస్ తో సలార్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే తెలుగులో మరో రెండు, హిందీలో పలు సినిమాలు, సిరీస్‌లకు కమిట్ అయిందని సమాచారం. ఇక ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటిస్తున్న చిత్రం 'కూలీ'.. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఏ విషయంలోనూ గోప్యత పాటించని శృతి తాజాగా తన సర్జరీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు. అందుకే సర్జరీ చేయించుకున్నా. అలాగే ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడా. ఇవన్నీ దాచాల్సిన అవసరం నాకు అని పించలేదు. నేను ఎన్నో సందర్భాల్లో ఈ విషయాల్ని చెప్పా. కొంతమంది ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. నేను గౌరవిస్తాను. కానీ, నాలా ధైర్యంగా చెప్పుకునే వాళ్లనూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమో భవిష్యత్తు లోవయసు పైబడ్డాక ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? అంటూ చెప్పుకొచ్చింది. శృతి హాసన్ చేసిన ఈకామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్అవుతున్నాయి.