కన్నడ బిగ్ బాస్ షోకు 11 ఏళ్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హోస్ట్ గా తన జర్నీని ఎంజాయ్ చేశానని చెప్పారు. 'నా శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు అనిపించింది. ఇతర భాషల్లో వచ్చినట్లుగా కన్నడ బిగ్ బాస్ కు క్రేజ్ రాలేదు. అందుకే ఇక సినిమాలకే టైమ్ కేటాయించాలనుకుంటున్నా' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
బిగ్ బాస్ చివరి సీజన్ లో నా సినిమా షూటింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతోంది. చెన్నై నుంచి అక్కడికి చేరుకోవడానికి గంటన్నర పడుతుంది. బెంగళూరు నుంచి అక్కడికి వెళ్లి, అక్కడ షూట్ చేసి, అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని, ప్రైవేట్ విమానంలో బెంగళూరుకు తిరిగి వచ్చి, బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి, వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేయాలి. ఇది నాకు చాలా అలసిపోయేది. నేను బెంగుళూరులో ఉంటే ఇబ్బంది లేదు. మరో చోట సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ షో చేయడం కష్టమని నటుడు సుదీప్ ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో అన్నారు.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో కిచ్చా సుదీప్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. తెలుగులోనూ ఈయనకి మంచి గుర్తింపు ఉంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్డం ఉన్న కిచ్చా సుదీప్ బిగ్బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకోవడం అనేది కచ్చితంగా ఆ షోకి చాలా పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. మరి కిచ్చా సుదీప్ స్థాయిలో బిగ్బాస్ హోస్టింగ్ చేయగల సత్తా ఉన్న కన్నడ స్టార్ ఎవరు అనేది చూడాలి. ఈ జాబితాలో శివ రాజ్ కుమార్ మొదలుకుని యశ్, రిషబ్ శెట్టి వరకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్త హోస్ట్ ఎవరు అనే విషయమై బిగ్బాస్ కన్నడ టీం మెంబర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.