RGV : జాన్వీతో సినిమా చేయను .. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Update: 2025-01-05 06:30 GMT

అలనాటి అందాల తార శ్రీదేవికి వీరాభిమాని దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆమెపై ఉన్న అభిమానంతోనే తాను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. శ్రీదేవి కంటే తనకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఇష్టం లేరని వర్మ గతంలో పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనను జాన్వీకపూర్ తో సినిమా చేస్తారా..? అని అడగ్గా.. చేయనని చెప్పారు. జాన్వీని శ్రీదేవి లో చూడలేమని అన్నారు. బాలీవుడ్లో గత నాలుగైదు సంవత్సరాలు గా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కి పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి నటించిన దేవర సినిమా ఆమెకు కమ ర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తెచ్చి పెట్టింది. మరో వైపు రాంచరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సైతం జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించేందు కు జాన్వీ కపూర్ ఓకే చెబుతోంది. శ్రీదేవి స్థాయికి జాన్వీ కపూర్ వెళ్తుందా? అనే విషయంపై వర్మ స్పందిస్తూ శ్రీదేవి స్థాయికి వెళ్లరు అని చెప్పారు.

Tags:    

Similar News