Samantha : ప్రేమించాలంటే భయమేస్తోంది.. సమంత ఆసక్తికర కామెంట్స్

Update: 2025-02-17 12:00 GMT

సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత రూత్ ప్రభు. తన అందం, అభినయం, స్టైల్ తో ఎప్పటికప్పుడు ట్రెం డింగ్ లో నిలుస్తూనే ఉంటుంది. నటనలో తనదైన మార్క్ చూపించిన ఈ అమ్మడు.. అటు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఒక స్టైల్ ఐకాన్ గా మారిపోయింది. ఇటీవల ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోషూట్ స్టిల్స్ మరోసారి ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ లో ఆమె స్టన్నిం గ్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోలను చూసి 'క్లాసీ అండ్ ఎలిగెంట్' అంటూ కామెంట్స్ పెడుతున్నా రు. అయితే ఈ పోస్టు క్యాప్షన్ గా సెలెనా గోమెజ్ ఇటీవల విడుదల చేసిన 'నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది' సాంగ్ లిరిక్స ను అటాచ్ చేసింది. “నువ్వు నా పక్కనే ఉంటావా? ఎల్లప్పుడూ నా చెయ్యి పట్టుకొ నే ఉంటావా? అంటూ పేర్కొంది. కాగా ఇటీవల సమంత.. డైరెక్టర్ రాజ్ నిధిమోరు తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోం ది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన క్యాప్షన్ అభిమానుల్లో మరో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇక సినిమాల విషయాకొస్తే 2024లో సమంత సిటాడెల్: హనీ బన్నీ వె బసిరీస్లో వరుణ్ ధావన్ తో కలిసి నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం, ఈ బ్యూటీ రక్త బ్రహ్మాండ అనే ఫాంటసీ డ్రామా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సిరీస్లో అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, వామిఖా గబ్బి కీ రోల్ ప్లే చేస్తున్నారు.

Tags:    

Similar News