Actress Imanvi : నాది పాకిస్తాన్ కాదు : ఇమాన్వీ

Update: 2025-04-25 09:15 GMT

పహెల్గాం దాడుల ఘటన భారత చిత్ర రంగంపైనా పడింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ కూతురు అనే ప్రచారం జరుగుతోది. చాలా మంది ఇమాన్వీ జాతీయతపై ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్ త సంబంధం ఉందంటూ కొందరు డైరెక్ట్ విమర్శలు చేశారు. ప్రభాస్ సినిమా నుంచి ఆమెను తప్పించాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా ఇమాన్వీ స్పందించింది. తన గురించి జరుగుతున్న ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. పౌరసత్వం విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పింది. దీనిపై ఇన్ స్టా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది ఇమాన్వి. తన కుటుంబంలో ఎవరికి గతంలో పాకిస్తాన్ సైన్యంతో సంబంధం లేదని తెలిపింది. ఇప్పుడు కూడా ఏ ఒక్కరూ పాకిస్తాన్ సైన్యం లో లేరని క్లారిటీ ఇచ్చింది. అలాంటి వ్యాఖ్యలు బాధాకరమని అసహనం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News