చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత యూత్ బాగా చెడిపోయింది అనే చెప్పేవాళ్లు చాలామందే ఉన్నారు. అఫ్ కోర్స్ దాని వల్ల లాభపడేవాళ్లూ ఉన్నారు. అయితే ఒకవైపు విదేశీ పోర్న్ సైట్స్ విచ్చలవిడిగా ఉన్న తరుణంలో పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఇండియాలో కూడా కొన్ని యాప్స్ క్రియేట్ అయ్యాయి. ఈ యాప్స్ లో పోర్న్, సెమీ పోర్న్ వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నారు. ఇందుకోసం చాలామంది అమాయక యువతులను ట్రాప్ చేశారు, చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ఆ మధ్య హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ తరహా అశ్లీసాన్ని ప్రసారం చేస్తోన్న ఇండియాకే చెందిన 25 యాప్స్ ను బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇప్పటి వరకూ ఈ మార్కెట్ లో టాప్ అనిపించుకున్న ఉల్లూ, ఆల్ట్, దేశీఫ్లిక్స్, నవరసా లైట్ వంటి యాప్స్ ఉన్నాయి.
మొత్తంగా యువత ఆలోచనలను పెడదారి పట్టించేలా ఇందులోని కంటెంట్ ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అవి మానవ సంబంధాలను సైతం దారుణంగా దెబ్బ తీస్తున్నాయని విమర్శలున్నాయి. వావి, వరుస లేని వీడియోస్ కూడా ఉంటాయనేది ఎక్కువమంది చేసే ఆరోపణ. మొత్తంగా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్స్ కొరడా ఝలిపించింది అనే చెప్పాలి.