కొన్ని సినిమాల గురించి ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. తెలియకపోవడం మేకర్స్ మిస్టేక్ అవుతుంది. ప్రాపర్ ప్రమోషన్ ఉంటేనే కదా జనాలకు తెలిసేది. ఇలాంటి మిస్టేక్ తో కనిపిస్తోన్న సినిమా జీబ్రా. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. కానీ ఈ మూవీ గురించి జనాలకు ఎక్కువగా తెలియదు. బట్ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ మోషన్ వీడియో విడుదల చేశారు. అది చూశాక అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణం.. ఈ మూవీ కాస్టింగ్. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
జీబ్రా మూవీని ఈశ్వర్ కార్తీక్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. అయితే ఈ మూవీ కాస్టింగ్ చూస్తే తెలుగు, తమిళ్, కన్నడ, హాలీవుడ్ నటులతో కనిపిస్తోంది. తెలుగు నుంచి సత్యదేవ్, సునిల్, కమెడియన్ సత్య, తమిళ్ నుంచి సత్య రాజ్, ప్రియా భవానీ శంకర్, కన్నడ నుంచి దాలి ధనంజయ్ (పుష్ప1లో జాలిరెడ్డి క్యారెక్టర్ చేశాడు).. హాలీవుడ్ నుంచి జెన్నిఫర్ అనే నటీనటులు కనిపిస్తున్నారు. అయితే ప్రధాన పాత్రలుగా సత్యదేవ్, ధనంజయ్ కనిపించబోతున్నారు. ఈ వీడియో చూస్తే క్రైమ్ డ్రామా అనేది అర్థం అవుతుంది. రెండు ముఠాల మధ్య సాగే పోరు అని.. ఎత్తులు పై ఎత్తులతో ఒకరినొకరు చిత్తు చేసుకుంటారు అనేలా చెస్ బోర్డ్ థీమ్ తో కనిపిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ క్రైమ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటీ అనేది చూడాలి. విశేషం ఏంటంటే ఈ మూవీని ప్యాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నారు.