Peddi : ఇంట్రెస్టింగ్ అప్డేట్ .. పెద్ది షూటింగ్ జెట్ స్పీడ్

Update: 2025-07-07 09:00 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో వైబ్ క్రియేట్ చేసింది. టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తు న్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. పెద్ది మూవీ షూటింగ్ ప్రస్తుతం లీడ్ నటీనటులతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తాంది. ఈ సినిమా అప్పుడే ఏకంగా 55 శాతానికి పైగా కంప్లీట్ అయ్యిపోయిందట. మొన్న మార్చి నాటికి 30% మేర పూర్తి అయ్యిన ఈ చిత్రం .. ఈ గ్యాప్ లోనే మరో 30 శాతం దగ్గరకి వచ్చేసిందని టాక్. మరోవైపు రెహమాన్ తమ హీరోతో చేస్తున్న పెద్ది సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మణిరత్నం లాంటి తలలు పండిన డైరెక్టర్ కే రెహమాన్ థగ్ లైఫ్ లాంటి ఆల్బమ్ ఇస్తే, కేవలం ఉప్పెన అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని కంగారు పడుతున్నారు. మరోవైపు ఈ నెలలోనే సాంగ్స్ షూట్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి 27న పెద్ద సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News