ఐరన్ లెగ్ శాస్త్రి సినిమాలను ఎందుకు వదులుకున్నారు .?

Iron Leg Sastry: ఆ లెగ్ పెడితే మటాషే.. వివాహానికి ఎంత బలమైన ముహూర్తం పెట్టినా ఆ లెగ్ ఆక్కడికి వస్తే పెళ్లి పెటాకులే.

Update: 2021-08-31 14:32 GMT

Iron Leg Sastry: ఆ లెగ్ పెడితే మటాషే.. వివాహానికి ఎంత బలమైన ముహూర్తం పెట్టినా ఆ లెగ్ ఆక్కడికి వస్తే పెళ్లి పెటాకులే. ఆయన అడుగు పెడితే.. ఏ పని అయినా సర్వనాశనం అవుతుంది. ఆ లెగ్ ఏదో అర్ధమై ఉంటుందనుకుంటా... ఐరన్ లెగ్. ఈ పేరు అన్ని రంగాల్లో వినిపిస్తుంది. విశ్వనాధ శాస్త్రి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఐరన్ లెగ్ శాస్త్రీ అంటే నేటి తరం పేక్షకులను కూడా తెలుసు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలేనా.. ఆయన అంతలా పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో జన్మించారు ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు విశ్వనాధ శాస్త్రి. ఆయనకు అప్పుల అప్పారావు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే సినిమాలో నటించిన ఐరన్ లెగ్ శాస్త్రి పేరు తెచ్చిపెట్టడంతో సినిమాల్లోనూ అవకాశాలు పెరిగాయి. ఇవివి సత్యనారాయణ ఆయనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు విశ్వనాధ శాస్త్రి పౌరోహితం చేసేవారు. సినిమాలపై ఆసక్తిలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయనలోని నటుడిని గుర్తించిన ఇవివి సత్యనారాయణ మంచి అవకాశాలు ఇచ్చారు.

మరోవైపు విశ్వనాధ శాస్త్రి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బరువు తగ్గితే అవకాశాలు తగ్గుతాయనుకున్నారేమో.. ఆ ప్రయత్నాలు సాగలేదు. అధిక బరువు కారణం గా అధిక రక్తపోటు తో గుండె జబ్బులు కూడా చుట్టుముట్టాయి. అయితే ఎక్కువ కాలం ఒకేతరహా పాత్రలు చేయడంతో.. మరో రకమైన నటనను కనబరుచుకోవడానికి ఆయనకు అవకాశం రాలేదు. ఆ తరహా కామెడీ కాలం చెల్లిపోయి ఐరన్ లెగ్ శాస్త్రి అవకాశాలు రావడం కూడా తగ్గింది.

ఓ వైపు అవకాశాలు తగ్గడం.. మరో వైపు అనారోగ్య సమస్యలు చుట్టముట్టడం తో ఆయన తిరిగి తన సొంత ఊరికి వెళ్లిపోయారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పేరు ఉండటంతో పురోహిత్యంలో కూడా అవకాశాలు రాలేదు. అది కేవలం నటనే అయినా.. ఆయన జీవితానికి మాత్రం శాపం గానే పరిణమించింది. అనారోగ్యం తో ఇబ్బందులు పడుతూ.. 2006 లో.. కేవలం 42 సంవత్సరాల వయసులోనే ఆయన కాలం చేసారు. చివరకు ఆయన చనిపోతే.. ఆయన దేహాన్ని రిక్షా లో పెట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మరీ బాధాకరం. ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు అర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. 

Tags:    

Similar News