Anasuya : హరిహరా.. అనసూయకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదా..?

Update: 2025-06-23 10:57 GMT

హాట్ యాంకర్ గా బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. ఆమె యాంకరింగ్ కంటే అప్పట్లో డ్రెస్సింగే ఎక్కువ పాపులర్ అయింది. ఆ ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ పైనా ఎంట్రీ ఇచ్చింది. చాలా మెమరబుల్ రోల్స్ తో మెప్పిస్తూ వస్తోంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనలోని నటిని చూపిస్తోంది. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ఎన్ని చేసినా రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర తన కెరీర్ లో ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ప్రస్తుతం కొన్ని టివి షోస్ లో జడ్జ్ గా వ్యవహరిస్తోన్న అనసూయ.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’చిత్రంలో ఓ పాత్ర చేసింది. తనపై ఓ పాట కూడా ఉంది. ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రంలో నటించినందుకు అనసూయకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అనే వార్త వైరల్ గా మారింది.

మామూలుగా అనసూయ లాంటి బ్యూటీని తీసుకుంటున్నప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో ముందే అన్నీ మాట్లాడుకుంటారు. అయితే అనసూయ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఛాన్స్ వచ్చిందని అన్నీ క్లియర్ గా మాట్లాడకుండానే ఒప్పుకుంది అనే టాక్ కూడా ఉంది. మరోవైపు పవన్ మూవీ కాబట్టి తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే ఇంకా తక్కువకే ఓకే చెప్పింది అనే వాదన కూడా ఉంది. అయితే అసలు ఆమెకు ఇప్పటి వరకూ రెమ్యూనరేషనే ఇవ్వలేదట. ఆ మధ్య డబ్బులిస్తేనే డబ్బింగ్ చెబుతా అని తెగేసి చెప్పిందట. దీంతో వాళ్లు.. ‘‘మేం డబ్బింగ్ చెప్పించుకుంటాం’’ అని అంతే ఖచ్చితంగా చెప్పడంతో అనసూయ అవాక్కయ్యిందట.

ఇన్ని సినిమాలు చేసి ఇంత ఇమేజ్ ఉన్న తనకు వేరే వారు డబ్బింగ్ చెబితే బావుండదని బాధను అణచుకుని తనే డబ్బింగ్ చెప్పేసిందట. మరి ఆ డబ్బులు ఆమెకు చేరతాయా లేదా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ నిర్మాత పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. అందుకే ఇలా డబ్బులు తర్వాత అడ్జెస్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో కొందరి విషయంలో ఇలాగే జరుగుతోందంటున్నారు. మరి అనసూయ మాత్రం కామ్ గానే ఉంది. ఎప్పుడైనా ఈ విషయంపై నోరిప్పుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News