జూలై నెలలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అనిపించుకోలేదు. దీంతో ఆగస్ట్ అయినా ఆకట్టుకుంటుందని భావించారు. బట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే వచ్చిన ఆరు సినిమాలూ కూడా అదే రూట్ లో ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనిపించుకోలేదు. అఫ్ కోర్స్ సినిమా రిలీజ్ కావడమే సగం విజయం అనుకున్న వాళ్లంతా ఆల్రెడీ సక్సెస్ మీట్స్ పెట్టుకున్నారు. బట్ కమర్షియల్ లెక్కలు చూస్తే, రివ్యూస్ చూస్తే ఏ సినిమాకూ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రాలేదు.
ఆగస్ట్ 1న వచ్చిన శివం భజే సిల్లీ స్క్రీన్ ప్లే అనిపించుకుంది. దశాబ్దాల క్రితమే వచ్చిన కోకిల అనే మూవీని కాపీ కొట్టి తీశారు అన్నారు. తర్వాత రోజు వచ్చిన అల్లు శిరీష్ టెడ్డీ బేర్ మూవీ బడ్డీ చెడ్డీ చిల్డ్రన్ ను కూడా మెప్పించడం కష్టమే అనే టాక్ తెచ్చుకుంది. ఓ రేంజ్ డిజాస్టర్ గా నిలిచిందీ మూవీ. రాజ్ తరుణ్ తిరగబడర సామీ టైటిల్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సీనియర్ డైరెక్టర తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఉషా పరిణయం మెప్పించలేదు. ఇక ఉన్నంతలో అలనాటి రామచంద్రుడు అనే మూవీ కొందరి హార్ట్స్ ను కొల్లగొట్టింది. కానీ సరైన ప్రమోషన్ లేదు. పోస్టర్ వాల్యూ కూడా లేకపోవడంతో ఎక్కువ ఆడియన్స్ ను రీచ్ కాలేదీ మూవీ. మొత్తంగా వచ్చిన సినిమాలన్నీ వాష్ అవుట్ అయినట్టే అనే చెప్పాలి. కంటెంట్ లేనప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదని మరోసారి ప్రూవ్ అయింది.