ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన దేవర బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ ఇమేజ్ ను పెంచుకునే క్రమంలో చేసిన దేవర అనుకున్నట్టుగానే ఆ పెంచేసింది. ఈ మూవీకి అన్నీ తానై చూసుకున్నాడు. కొరటాల అంతకు ముందు ఆచార్యతో డిజాస్టర్ ఇవ్వడంతో.. అందరూ ఒద్దని చెప్పినా వినకుండా డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. అతని నమ్మకమే నిజమైంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో దేవర బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రాజెక్ట్ మధ్యలోనే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగానే దేవర ముగింపు కనిపిస్తుంది. మరి సెకండ్ పార్ట్ ఎప్పుడూ అంటే త్వరలోనే అన్నారు తప్ప ఎప్పుడు అనేది ఎప్పుడూ చెప్పలేదు. బట్ చూస్తుంటే దేవర 2 ఇక లేనట్టుగానే కనిపిస్తోంది. అందుకు కారణం ఎన్టీఆర్ లైనప్.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఆగస్ట్ 14న విడుదలవుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇది 2026 జూన్ 25న విడుదల చేస్తాం అని చెప్పారు. ఇంత వరకూ ఓకే. బట్ ఆ తర్వాత దేవర 2 నే అనుకోవడానికి లేకుండా నిర్మాత నాగవంశీ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మా బ్యానర్ లోనే చేయబోతున్నాడు ఎన్టీఆర్ అని చెప్పాడు. ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ మూవీ. మరి పౌరాణికం అంటే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతాడో చెప్పాల్సిన పనిలేదు. నట విశ్వరూపం చూపిస్తాడు. ఆ తర్వాత సితార బ్యానర్ లో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్నాడు. ఎలా చూసినా దేవర 2 కంటే ఈ రెండూ బెటర్ అండ్ బిగ్ ప్రాజెక్ట్స్. సో.. ఇవి వదులుకుని లేదా.. హోల్డ్ లో పెట్టి మరీ దేవర 2కు వెళతాడు అనుకోలేం. అంచేత ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టే అనుకోవచ్చు అంటున్నారు టాలీవుడ్ లో. సో.. ఇక కొరటాల శివ వేరే కథ, వేరే హీరోను చూసుకోవాల్సిందే ఇక.