Gopichand : గోపీచంద్ ‘అవుట్ డేటెడ్’ అయిపోయాడా ..?

Update: 2024-10-17 10:16 GMT

హిట్ అనే మాటకు ఉన్న విలువ.. ఫ్లాప్ సినిమాకు కూడా సక్సెస్ మీట్ చేసుకుని కేక్ లు తినిపించుకున్నంత చిన్నది కాదు. ఈ మాట వినాలంటే చాలా తతంగాలే ఉన్నాయి. అవేం లేకుండా చుట్టు పక్కల వాళ్లు చెప్పారనో.. అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణలా బాబూ మన బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారనో నమ్మేస్తే అంతే సంగతలు. మేచో స్టార్ గోపీచంద్ కూడా చాలాకాలంగా ఇదే మబ్బుల్లో ఉన్నాడు. నిజానికి అతను ఎంచుకుంటున్న కథలు అతని సెలెక్షనేనా లేక అలాంటి కథలు మాత్రమే అతని వద్దకు వెళుతున్నాయా అనేది చెప్పలేం కానీ.. మనోడు సాలిడ్ గా హిట్ అనే మాట విని ఎన్నాళ్లైంది..? అని చూస్తే సడెన్ గా ఫ్యాన్స్ కూడా చెప్పలేరు. పోనీ ప్రయోగాలు ఏమైనా చేస్తున్నాడా అంటే లేదు. పెద్ద పెద్ద హీరోలే ఇమేజ్ ను దాటి ఎక్స్ పర్మెంట్స్ చేస్తున్నారు. అంతెందుకు గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ నే తీసుకోండి.. బాహుబలి రెండు పార్ట్స్, సాహో తర్వాత అస్సలే మాత్రం మాస్ ఎలిమెంట్స్ లేని రాధేశ్యామ్ తో రాలేదు. ఈ మూవీ రిజల్ట్ అటుంచితే కనీసం ఓ కొత్త ప్రయత్నం చేశాడు కదా.. ప్రభాస్. వరుసగా డిజాస్టర్సే పడుతున్నా.. గోపీచంద్ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు అంటే ఖచ్చితంగా అతని జడ్జిమెంట్ వందశాతం తప్పింది అనే చెప్పాలి.

2015లో వచ్చిన జిల్ హిట్ అనిపించుకుంది. ఆ తర్వాత వరుసగా సౌఖ్యం, గౌతమ్ నందా, ఆక్సీజన్, పంతం, చాణక్య, సీటీమార్, ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా.. తాజాగా విశ్వం. వీటిలో సీటీమార్ మాత్రం కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది కానీ.. గోపీచంద్ ఇమేజ్ కు తగ్గ పెద్ద హిట్ అయితే ఖచ్చితంగా కాదు. శ్రీను వైట్ల ఇంకా రెడీ ఫార్మాట్ లోనే చేసిన విశ్వం మూవీ విజయం సాధించిందని కేక్ లు కట్ చేసి టూర్లు మొదలుపెట్టారు కానీ.. ఈ మూవీ చూసిన ఎవరికైనా ఇందులో కొత్తదనం ఏముందీ అనిపించక మానదు. ఏదేమైనా ఇలాంటి అవుట్ డేటెడ్ కథలతో చాలా టాలెంటెడ్ అనిపించుకున్న.. చాలామంది కలలు కనే మాస్ హీరో అనే ఇమేజ్ ఉన్న గోపీచంద్ కూడా సినిమా సినిమాకూ ‘హీరోగా’అవుట్ డేటెడ్ అయిపోతున్నాడు అనేది నిజం. 

Tags:    

Similar News