Nani HIT 3 : నాని హిట్ 3 సినిమా ప్లానింగ్ లోనే లేదట

Update: 2025-04-23 03:51 GMT

నేచురల్ స్టార్ నుంచి వయొలెంట్ స్టార్ గా మారుతున్నాడు నాని. సినిమా సినిమాకూ మాస్ డోస్ ను వయొలెన్స్ ను పెంచుతున్నాడు. హిట్ 3కి అయితే తన ఇమేజ్ ను ఎక్స్ పెక్ట్ చేసి సెన్సిటివ్ లేడీస్, చిన్న పిల్లలు రావొద్దని తనే స్ట్రిక్ట్ గా చెబుతున్నాడు. అంత రక్తపాతం ఉందట సినిమాలో. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ను షేర్ చేసుకున్నాడు నాని. నిజానికి హిట్ 3 అనే సినిమా వారి ప్లానింగ్ లో లేదట. శైలేష్ కొలను వద్ద ఉన్న రెండు కథలతో రెండు భాగాలు రూపొందించారు. ఆ సినిమాలో కీలకమైన కేమియో రోల్ ఎవరు చేస్తే బావుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు తనే చేస్తే బెటర్ అని చేశాడట.ఆ తర్వాత శైలేష్ వెంకటేష్ తో సైంధవ్ మూవీ చేశాడు. డిజాస్టర్ చూశాడు.

ఇక ఈ హిట్ 3కి కథా పాయింట్ నానిదేనట. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి ఈ కథను డెవలప్ చేశారట. మహిళ ప్రధానమైన కంటెంట్ గా, ఇన్వెస్టిగేషన్ సాగాలని ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉండాలని, ముందుగా అనుకునే ఈ కథ రాసుకున్నారట.నానికి ఆ ఐడియా రాకపోయి ఉంటే ఈ హిట్ 3 రూపొందేదే కాదు అంటున్నారు. అదే టైమ్ లో ఈ ఫ్రాంఛైజీని ఇలాగే కంటిన్యూ చేయాలని కూడా భావిస్తున్నారట. సో.. ఇదో హిట్ వర్స్ అయిపోతుంది ఇంక. స్పైడర్ మేన్ తరహాలో ప్రతి పార్ట్ లో ఉన్న హీరోను తెచ్చి ఒక సినిమా చేస్తే ఇంకా అదిరిపోతుందేమో.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఇంకా రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లోనూ, కార్తీ, అడివి శేష్, విశ్వక్ సేన్ అతిథి పాత్రల్లోనూ కనిపించబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నానినే నిర్మించిన ఈ చిత్రం మే 1న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

Tags:    

Similar News