మ్యాన్ ఆఫ్ మాసెస్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దేవరతో ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్ తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు. దీంతో పాటు దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. అతని లైనప్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. అలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ టాపిక్ రావడం ఏంటీ అనేది మాత్రం క్లియర్ గా ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తోన్న మూవీ ప్రశాంత్ నీల్ దే కదా. అతనే ఈ ఆర్ఆర్ఆర్ లో ఓ బ్యూటీని మళ్లీ తీసుకోవాలనుకున్నాడు.
ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా ఆల్రెడీ రుక్మిణి వసంత్ నటిస్తోంది.ఆమెతో పాటు టోవినో థామస్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోనే ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పుడీ ఆమెతో పాటు ఆర్ఆర్ఆర్ లో నటించిన ఒలీవియా మారిస్ ను తీసుకోబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఆమెను ఈ పాత్రకు తీసుకోవాలనుకున్నది కూడా ఎన్టీఆర్ అని కూడా టాక్. అయితే తన పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని టాక్. ఆర్ఆర్ఆర్ లో ఆమె నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మరి ఆర్ఆర్ఆర్ కు రెండో భాగం ఉంటుందో లేదో తెలియదు. బట్ ప్రశాంత్ నీల్ మూవీలో ఒలీవియా ఓ కీలక పాత్రలో నటించబోతోందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి ఇది నిజమే అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేసిన ఓ మ్యాజిక్ ను మళ్లీ ఆమె రిపీట్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే ఒలీవియా నటించడం ఇంకా కన్ఫార్మ్ చేయలేదు.