Mahesh Babu : ప్రియాంక హిట్ కొట్టింది.. మహేష్ కు ప్లస్ అవుతుందా..?

Update: 2025-07-05 08:39 GMT

టాలీవుడ్ ఇప్పుడు బాగా ఎదిగిపోయింది. ఇండియన్ సినిమాకు అడ్రెస్ గా మారింది తెలుగు సినిమా. ఈ క్రెడిట్ ఖచ్చితంగా రాజమౌళికే చెందుతుంది. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తో మన సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. ఒకప్పుడు హాలీవుడ్ లో ఆఫర్ వస్తే అబ్బో అనుకునేవారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ వారు కూడ రాజమౌళి మూవీ చూసి ఓహో అనేస్తున్నారు. ఆ రేంజ్ కు వెళ్లాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నాడు. ఇందులో ఫీమేల్ లీడ్ లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు.

మహేష్ బాబు ఇప్పటి వరకూ టాలీవుడ్ దాటలేదు. ప్యాన్ ఇండియా మార్కెట్ లేదు. అందుకే మొత్తం జక్కన్న భుజాలపైనే ఉంటుంది. అయితే ప్రియాంక చోప్రా కూడా కాస్త భుజం కాయబోతోంది. ప్రియాంక చోప్రా ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలతో అక్కడి ఆడియన్స్ కు సుపరిచితం. అయితే తాజాగా తను నటించిన ఓ మూవీ సూపర్ హిట్ అయింది. అంతే కాక ఆ మూవీలో అందరికంటే ఎక్కువగా ప్రియాంకకే అప్లాజ్ వస్తోంది. తను చేసిన స్టంట్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’అనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అఫ్ కోర్స్ ప్రైమ్ కోసమే చేసిన సినిమా ఇది. ఈ నెల 2నుంచి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇల్యా నైష్యుల్లర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్ సేనా, ఇడ్రిస్ ఎల్బా వంటి నోటెడ్ స్టార్స్ యాక్ట్ చేశారు. అయినా అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ప్రియాంక చోప్రా. ప్రపంచ వ్యాప్తంగా తనకు ప్రశంసలు వస్తున్నాయి.

మహేష్ బాబు నిజంగా హాలీవుడ్ రేంజ్ కటౌట్. ఆ కటౌట్ ఆ ఆడియన్స్ కు పరిచయం అయ్యే సందర్భంలో సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ప్రియాంక చోప్రా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టి ఉండటం టీమ్ కు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు రాజమౌళితో పాటు ప్రియాంక కూడా వాల్డ్ ఆడియన్స్ కు నోటెడ్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా మహేష్ బాబుకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News