Kanchana 4 : కాంచన 4లో రష్మిక మందన్నా.. పూజా హెగ్డే తీసేశారా..?

Update: 2025-09-01 09:15 GMT

2007లో ముని అనే సినిమాతో హారర్ కామెడీ సినిమాలు మొదలుపెట్టాడు కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన రాఘవ లారెన్స్. ముని సూపర్ హిట్ అయింది. తర్వాత కాంచన 2, కాంచన 3 అంటూ మరో రెండు ఫ్రాంఛైజీస్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఒకే తరహా కథతో డిఫరెంట్ కథనంతో ఆకట్టుకుంటున్నాడు లారెన్స్. రీసెంట్ గానే కాంచన 4 అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టాడు. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా జాయిన్ అయింది. ఇంతకు ముందు ఈ మూవీలో నటిస్తున్నారు అంటూ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. ఆ ఇద్దరితో పాటు రష్మిక జాయిన్ అయిందా లేక పూజా హెగ్డేను తీసేసి రష్మిక మందన్నాను పెట్టుకున్నారా అంటూ కోలీవుడ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ప్రస్తుతం స్టార్డమ్ పరంగా చూసినా, సక్సెస్ రేట్ పరంగా చూసినా రష్మిక కంటే పూజాహెగ్డే చాలా వెనకే ఉంది. రష్మిక ప్రధాన పాత్ర కాకుండా అయితే చేయదు. అటు పూజా కూడా అంతే అనుకోవచ్చు. సో.. ఈ ఇద్దరి మధ్య పోటీలో రష్మికనే ఎంచుకున్నారు అనే టాక్స్ నడుస్తున్నాయి. మరోవైపు లారెన్స్ మూవీస్ లో ముగ్గురు , నలుగురు హీరోయిన్లు కనిపిస్తూనే ఉంటారు. అందువల్ల ఈ ముగ్గురూ ఉండొచ్చు అనే టాక్ కూడా ఉంది. అయితే గతంలో చేసిన ముగ్గురు నలుగురు హీరోయిన్లలో ఒకరిద్దరు కేవలం స్కిన్ షోకు మాత్రమే పరిమితం. ఆ షో చేయడానికే అయితే రష్మిక ఒప్పుకుని ఉండేది కాదు. అందుకే రష్మిక తీసుకుని పూజా హెగ్డేను వదిలించుకున్నారు అంటున్నారు. అది నిజమా కాదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది. 

Tags:    

Similar News