Sai Pallavi : బాలీవుడ్ కే తరలిపోతున్న సాయి పల్లవి

Update: 2025-07-12 07:15 GMT

సౌత్ లో చాలా ఎక్కువమందికి ఇష్టమైన హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. తను ఎంచుకునే పాత్రలు, కథలు అలాఉన్నాయి. అద్భుతమైన నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. ఇక డ్యాన్స్ గురించి చెప్పాల్సిందేముందీ. తను ప్రొఫెషనల్ డ్యాన్సర్ గానే గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ కు దూరంగా చాలా ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉన్న ఈ బ్యూటీకి తెలుగు నుంచే స్టార్డమ్ వచ్చింది. అయితే తను తెలుగును పూర్తిగా వదిలేయబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.

ఈ యేడాది వచ్చిన తండేల్ తర్వాత సాయి పల్లవి మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. ఆ మాటకొస్తే సౌత్ లోనే ఇంకే సినిమాకూ కమిట్ కాలేదు. అందుకు కారణం రామాయణం అనుకున్నారు చాలామంది. కానీ రామాయణ ఒక్కటే కాదు.. ఇకపై తను వరుసగా అక్కడే సినిమాలు చేయబోతోంది. ఆల్రెడీ రామాయణ కంటే ముందే ఒప్పుకున్న 'ఏక్ దిన్' అనే సినిమా పూర్తయింది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ మూవీలో హీరో కావడం విశేషం. ఇక రామాయణ ఫస్ట్ పార్ట్ వచ్చే యేడాది, సెకండ్ పార్ట్ ఆ పై యేడాది విడుదల కానున్నాయి. ఆ తర్వాత కూడా తను రెండు సినిమాలకు కమిట్ అయి ఉంది.

సల్మాన్ ఖాన్ తో పాటు హృతిక్ రోషన్ ల సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాటిల్ ఆఫ్ గల్వాన్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ లో హీరోయిన్ సాయి పల్లవే. అలాగే హృతిక్ క్రిష్ 4 తర్వాత చేయబోయే సినిమాలోనూ తనే హీరోయిన్. ఇలా వరుసగా భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో తన క్యాలెండర్ నిండబోతోంది. అంటే ఇక తెలుగు, తమిళ్ చిత్రాలకు టైమ్ ఎక్కడుంటుంది. ఒకవేళ టైమ్ ఉన్నా.. తను సౌత్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెబుతున్నారు. తనను విపరీతంగా ఎగ్జైట్ చేసే కథైతే తప్ప కొన్నాళ్ల వరకూ ఈ వైపు రాదేమో. ఏదేమైనా సాయి పల్లవి కూడా ఇలా చేయడం చాలామందికి ఆశ్చర్యంగానే ఉంది.

Tags:    

Similar News