మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ లదే. అందుకు కారణం కూడా సందీపే. అతని అర్జున్ రెడ్డి, యానిమిల్ మూవీస్ చూసిన తర్వాత తన హీరోల అగ్రెషన్ నుంచి ప్రభాస్ ను ఊహించుకుంటూ ఓ రేంజ్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. పైగా ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే మాట కూడా చెప్పాడు సందీప్. సందీప్ రైటింగ్ లో నుంచి వచ్చిన ఓ అగ్రెసివ్ హీరో పోలీస్ అయితే ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. అయితే ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అవుతుంది. నిజానికి గతేడాది నవంబర్ లోనే సెట్స్ పైకి వెళుతుంది అన్నారు. బట్ కాలేదు. ఈ లోగా ప్రభాస్ హను రాఘవపూడితో మరో సినిమా ఓకే చేసుకున్నాడు.. షూటింగ్ కూడా జరుగుతోంది. అయినా స్పిరిట్ ఎందుకు లేట్ అవుతుందీ అంటే.. కారణం సందీప్ అంటున్నారు.
సందీప్ రెండు సినిమాలూ చూస్తే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో పెద్దగా పని ఉండదు. కంటెంట్ పరంగానే వెళతాడు. లొకేషన్స్ కూడా లోకల్ గానే కనిపిస్తాయి. అందుకే చాలా త్వరగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఈ కారణంగానే ప్రభాస్ నుంచి బల్క్ డేట్స్ అడుగుతున్నాడు. ఒక్కసారి స్పిరిట్ లోకి ఎంటర్ అయితే మళ్లీ పూర్తయ్యాకే వెళ్లాలనేది అతని రూల్. కానీ అటు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ(వర్కింగ్ టైటిల్) మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఈ సెప్టెంబర్ వరకు రాజా సాబ్ పూర్తవుతుంది. అందుకే ఆ నెల నుంచే సందీప్ సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనే న్యూస్ వినిపిస్తోంది.
నిజానికి సందీప్ ఒప్పుకుని ఉంటే.. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ఎప్పుడో డేట్స్ ఇచ్చి ఉండేవాడట. కానీ సందీప్ మాత్రం బల్క్ డేట్స్ కావాలనే పంతంతో ఉన్నాడు. అందుకే ఆలస్యం అయింది. లేట్ అయినా సినిమా స్టార్ట్ అయితే మాత్రం చాలా వేగంగానే పూర్తి చేస్తాడు సందీప్. అది మాత్రం పక్కా.