Thamannaah : ఓదెల 2 కూడా అమ్మోరు, అరుంధతి అవుతుందా..

Update: 2025-04-16 07:45 GMT

కొన్ని సినిమాల రిజల్ట్స్ ముందే తెలిసిపోతుంటాయి. ఏ కొన్నిసార్లో తప్ప అంచనాలు మిస్ అవ్వవు. ఈ గురువారం విడుదల కాబోతోన్న తమన్నా నటించిన ఓదెల 2 విషయంలోనూ ఇదే వినిపిస్తోంది. సినిమా ష్యూర్ షాట్ అంటున్నారు. తమన్నా ఖచ్చితంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోబోతోంది అంటూ ఊహిస్తున్నారు. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు. అచ్చం ఫస్ట్ పార్ట్ కూ ఇదే జరిగింది. ఓదెల పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరగడానికి కారణం.. తమన్నా అఘోరీ పాత్రలో నటించడం.. టీజర్, ట్రైలర్ తో బలమైన ఇంపాక్ట్ కనిపించడం.

టీజర్ మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. వెంటనే బిజినెస్ రేంజ్ మారింది. ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇది ష్యూర్ షాట్ అనేశారు. అంత వరకూ బానే ఉంది. అయితే ఇంకొందరు మాత్రం ఈ చిత్రం సౌందర్యకు అమ్మోరులా, అనుష్కకు అరుంధతిలా తమన్నాకూ ఆ స్థాయి ఇమేజ్ తెస్తుంది అంటున్నారు. బట్ అమ్మోరు సౌందర్యకు కెరీర్ ఆరంభంలో పడింది. అది తనకు మహిళల్లో తిరుగులేని క్రేజ్ తెచ్చింది. ఆ క్రేజ్ ను పెంచుకుంటూ టాప్ హీరోయిన్ అయిపోయింది. అనుష్క విషయంలో మరీ కెరీర్ ఆరంభం కాదు కానీ.. విపరీతమైన గ్లామర్ రోల్స్ చేస్తోన్న టైమ్ లో పడింది. తనలో ఇంత మంచి నటి ఉందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

తమన్నా పరిస్థితి అలా కాదు.. తనూ ఎన్నో గ్లామర్ రోల్స్ లో నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేసింది. అందుకే ఇది తన కెరీర్ లో మరో మూవీ అవుతుందేమో కానీ మరీ అమ్మోరు, అరుంధతి రేంజ్ తెస్తుందని ఎక్స్ పెక్ట్ చేయడం కాస్త అతి అవుతుందనే చెప్పాలి. అయినా ఆ ఇమేజ్ తెచ్చిందంటే ఖచ్చితంగా అది ఈ మూవీ టీమ్ హార్డ్ వర్క్ అనుకోవాలి. 

Tags:    

Similar News