Akkineni Akhil : అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా

Update: 2025-01-20 12:30 GMT

అక్కినేని వారి ఇంట మరో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య నటి శోభిత ధూళిపాలను రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందే అక్కినేని అఖిల్ ప్రేమ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. తను కొన్నాళ్లుగా జైనాబ్ రవ్ జీతో ప్రేమలో ఉన్నాడు. ఆమె తండ్రి బిగ్ షాట్. ఇటు నాగ్ ను కూడా అంతా బిజినెస్ సర్కిల్స్ లో బిగ్ షాట్ గానే చూస్తారు. సో.. ఇద్దరి ప్రేమకు ఇళ్లల్లో ఇబ్బందులేం రాలేదు. ఆ మధ్య ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇక పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసిందంటున్నారు.

ఈ మార్చి 24న అఖిల్, జైనాబ్ ల పెళ్ల జరగబోతోందని సమాచారం. ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకుని లగ్న పత్రిక కూడా రాయించారు అంటున్నారు. ఈ పెళ్లికి సినిమా, వ్యాపార, రాజకీయ రంగాల్లోని అతిరథులెందరినో ఆహ్వానించబోతున్నారట. చిన్న కొడుకు పెళ్లిని రంగ రంగ వైభవంగా జరిపేందుకు నాగ్ ఇప్పటి నుంచే ప్లానింగ్స్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.

ఇక అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. సితార, అన్నపూర్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని మురళీ కృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకు ముందు కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుకథ అనే చిత్రంతో ఆకట్టుకున్నాడు. చిత్తూరు ప్రాంతంలోని రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారట. దీంతో పాటు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘ధీర’అనే సినిమాకూ కమిట్ అయి ఉన్నాడు అఖిల్. మొత్తంగా ఈ రెండు సినిమాలతో హిట్స్ కొట్టి ‘ఫ్యాన్స్ కు ఫేస్’చూపించాలనుకుంటున్నాడు. 

Tags:    

Similar News