విక్టరీ వెంకటేష్.. కెరీర్ మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలవుతోంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూసి ఉన్నాడు. అయితే కొన్నిసార్లు ఫ్లాపులు వచ్చినప్పుడు కంటే బ్లాక్ బస్టర్స్ పడినప్పుడే ఎక్కువ భయం ఉంటుంది. ఆ బ్లాక్ బస్టర్ పరంపరను కంటిన్యూ చేయడం అంత సులభం కాదు. ఎంత మంచి కథ అనుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో తేడా కొడుతుంది. మేకర్స్ కు చాలా గొప్పగా అనిపించిన పాయింట్ ఆడియన్స్ కు చప్పగా అనిపించొచ్చు. ఇవన్నీ కొత్తవాళ్లకు సమస్య. కానీ వెంకటేష్ లాంటి స్టార్ భయపడుతున్నాడంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది.
వెంకీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు. నిన్నటి తరంలో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో కలిసి ‘నలుగురు’హీరోల్లో ఒకడుగా ఉన్నాడు. మాస్ లో ఎక్కువగా క్లాస్ లో ఇంకా ఎక్కువగా ఇమేజ్ ఉన్న హీరో. అందరు హీరోల అభిమానులూ అతన్ని అభిమానిస్తారు. ఇదో స్పెషల్ క్వాలిటీ. అయితే ఇన్నాళ్ల కెరీర్ లో ‘ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీ హిట్’ కొట్టాడు వెంకటేష్. తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతి బరిలోనే నిలిచి ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్టే కొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 254 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతుకు ముందు ఈ ప్లేస్ వాల్తేర్ వీరయ్య పేరుతో 230 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉండేది. అలాంటి వెంకీ ఇంత పెద్ద హిట్ కొట్టడమే అతనికి కొత్త చిక్కుల తెస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకూ మరో కొత్త సినిమాకు కమిట్ కాలేదు వెంకీ. ఏ కథా నచ్చలేదు. వరుసగా కొత్తవాళ్లు, పాతవాళ్లు చెప్పే కథలన్నీ వింటున్నాడు. అయితే ఓ కొత్త కుర్రాడు చెప్పిన కథ బావుంది అన్నాడట. కానీ చేస్తాడా లేదా అనేది చెప్పలేదు. ఏదేమైనా బ్లాక్ బస్టరే ఎక్కువ భయపెడుతుంది అనేందుకు ఇప్పుడు వెంకటేష్ ఉన్న స్థితి ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదైనా ఇంత పెద్ద హిట్ తర్వాత అతి జాగ్రత్త పేరుతో ఎక్కువ టైమ్ తీసుకున్నా ఇబ్బంది తప్పదు.