కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రకుల్ ప్రీత్ సింగ్. అంతకు ముందు 2007లో గిల్లీ అనే కన్నడ సినిమాలో యాక్ట్ చేసింది. తర్వాత తెలుగులో యాక్ట్ చేసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఈ అమ్మడికి ఎంతో ఫేమ్ తెచ్చింది. తర్వాత బాలీవుడ్ తరలివెళ్లిన ఈ భామ.. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట గత ఏడాది గోవాలో వివాహ బంధంతో ఒక్కటైంది. వ్యక్తిగత అంశాలపై ఎప్పుడూ గోప్యతను పాటించే రకుల్ ప్రీత్ తన వివాహం తాలూకు విషయాలను పంచుకుంది. తమ పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా గోప్యం జరిగిందని చెబుతూనే సింపుల్ గా, సౌకర్యవంతంగా చేసుకోవాలని ముందే నిర్ణయంచుకున్నామని చెప్పింది. తమ జీవితంలో బెస్ట్ క్రీడేస్ కావాలని కోరుకున్నామని అన్నారు. ఇందుకోసం నో ఫోన్ పాలసీని అమలు చేశామంటున్నారు. ఫొటోలు లీక్ చేసి హంగామా చేయాలని తాము కోరుకోలేదని చెప్పారు. తమకు తాముగానే పెళ్లి ఫొటోలు రివీల్ చే యాలనుకున్నామని అంటోంది రకుల్. ప్రస్తుతం ఈ భామ మేరీ హస్బెండ్ కీ బీవీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 22న థియేట్రిక ల్ గా రిలీజ్ కానుంది.