Neha Dhupia : చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది.. నేహా ధూపియా సంచలన కామెంట్స్
బాలీవుడ్ నటి నేహా ధూపియా 2018లో నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. సీక్రెట్ గా డేటింగ్ చేసిన వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎన్నడూ బయట పెట్టలేదు. అలాంటిది సడన్ గా వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పెళ్లయిన ఆరు నెలలకే ఈ జంటకు మెహర్ అనే కూతురు జన్మించింది. దీంతో మ్యారేజీకి ముందే నేహా ప్రెగ్నెంట్ అని నెట్టింట విమర్శలు వెల్లు వెత్తాయి. ఈ ట్రోలింగ్ గురించి తాజాగా నటి స్పందించింది. 'నేను అంగదను పెళ్లాడిన ఆరు నెలలకే పాప పుట్టింది. అలా ఎలా జరుగుతుందని చర్చ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన మహిళా నటుల గురించి ఇప్పటికీ స్టోరీలు వస్తూనే ఉంటాయి. నీనా గుప్త, ఆలియా భట్ ల జాబితాలో నేనూ ఉన్నాను. దీన్ని ఇంతలా హైలైట్ చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది' అని పేర్కొంది. నీహా గుప్తా.. క్రికెటర్ వివయన్ రిచర్డ్స్ ను ప్రేమించింది. వీరికి మసాబా గుప్తా జన్మించింది. ఇక బాలీవుడ్ జంట ఆలియా భట్ -రణ్వీర్ కపూర్ కు రాహా జన్మించింది. నేహా ఇటీవల బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా బిజీ అయ్యింది.