Samantha : ఇకపె అది జరగదు.. సమంత క్లారిటీ

Update: 2025-08-23 08:30 GMT

తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్ సినిమాలు అందిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఎమోషనల్ రోల్స్, లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాల వరకు విభిన్నమైన పాత్రలో నటించి అభిమానుల హృదయాలను దోచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితం, కెరీర్, ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిం ది ఎన్ని సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదని, మనం చేసిన చిత్రాల నాణ్యతే ముఖ్యమని తాను ఎప్పుడూ నమ్ముతానని చెప్పింది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానంటోంది. గతంతో పోలిస్తే తనలో చాలా మార్పు వచ్చిందని, ఫిట్నెస్, సినిమాలు రెండింటి పైనా సమానంగా దృష్టి పెడుతున్నాని తెలిపింది. తాను చేసిన ప్రాజెక్టు గుర్తింపు కోసం కాకుండా తన మనసుకు దగ్గరగా ఉన్న కథలేనని సమంత చెప్పింది. తన వర్క్ ప్లానింగ్ లో మార్పు చేసుకున్నట్టు కూడా తెలిపింది. ఇకపై తక్కువ సినిమాలు చేస్తా నని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధా న్యం ఇస్తున్నానని అంటోంది. ఒకేసారి ఐదు ప్రాజెక్ట్లు చేయడం జరగదని తెలిపింది. తన శరీరం చెప్పినట్టు వింటున్నానంటోంది.

Tags:    

Similar News