Varsha : వర్ష సోదరుడికి యాక్సిడెంట్.. దయచేసి అలా చేయొద్దంటూ పోస్ట్..!
Varsha : జబర్దస్త్ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్‌లు వెలుగులోకి వచ్చారు. అందులో వర్ష ఒకరు.;
Varsha : జబర్దస్త్ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్‌లు వెలుగులోకి వచ్చారు. అందులో వర్ష ఒకరు. మోడలింగ్ నుంచి బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఇదిలావుండగా వర్ష తాజాగా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయింది.
'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్ అవ్వకుండా ఉంటారు" అని పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం తన సోదరుడి పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చింది.