Jacqueline Fernandez : రెడ్ సీ ఫెస్టివల్లో జాక్వెలిన్!

Update: 2025-05-19 10:45 GMT

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రాన్స్ లో జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె 'రెడ్ సీ ఫెస్టివల్ 'లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా నిర్మాతలు, నటులు, సాంకేతిక విభాగంలో ఉన్నవారు సినిమాలకు చేసిన కృషిని ప్రస్తావించే 'ఉమెన్ ఇన్ సినిమా' గాలాలో పాల్గొనే గౌరవం జాక్వెలి నికి దక్కింది. గత ఏడాది గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న 'ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ లైట్ 'లో నటించిన ఛాయా కదమ్ ఆ 77వ చిత్రోత్సవాల్లో సందడి చేశారు. ఈ ఏడాదీ ఆమె కాన్స్ వెళ్లారు. ఇంకా భారతదేశం నుంచి డిజిటల్ కంటెంట్ క్రియే టర్ మాసూమ్ మీనావాలా, ఇండియన్ -థాయ్ బ్యూటీ, 'మిస్ యూనివర్స్ య్ల్యాండ్ సరాబురి' వీణా ప్రవీణర్ సింగ్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింద్వానీ పాల్గొన్నారు. 'తన్వీ ది గ్రేట్' స్క్రీనింగ్ కోసం హాజరైన ఆ చిత్రదర్శకుడు అనుపమ్ ఖేర్ కూడా రెడ్ కార్పెట్ పై స్టైలిష్ గా కనిపించారు.

Tags:    

Similar News