Nag Aswin : రీ రిలీజ్ కే 8 కోట్లు ఖర్చుపెట్టించిన ‘అల్లుడు’

Update: 2025-05-03 11:30 GMT

అన్ని రీ రిలీజ్ లు ఒకటి కాదు అని నిరూపించబోతున్నాడు ఈ దర్శకుడు. అయితే ఇది అతను రూపొందించిన సినిమా కాదు. తన మామ నిర్మించిన సినిమా. ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం కోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టించాడు. మరి అతనికి ఈ మూవీపై అంత ఇంట్రెస్ట్ ఏంటీ అనే ప్రశ్న ఎదురుకావొచ్చు. నిజమే కానీ ఈ సినిమాను అతను అజరామరం చేయడానికే ఇంత ఖర్చు చేయించాడు అనేది అసలు పాయింట్. మెగాస్టార్ ఎవర్ గ్రీన్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని ఈ నెల 9న రీ రిలీజ్ చేయబోతున్నారు. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశాడు. టైటిల్ పాత్రకు శ్రీదేవి తప్ప ఇంకెవరూ సెట్ కారు అని అప్పుడే కాదు.. ఎప్పటికీ ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఈ మూవీ రీ రిలీజ్ బాధ్యతలను అశ్వనీదత్ తన అల్లుడు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఇచ్చాడు. మరి నాగ్ అశ్విన్ అంటే మాటలా. తన రేంజ్ లో ఈ మూవీని తీర్చి దిద్దాడు.

నాగ్ అశ్విన్ ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా 4 కేలోనే కాకుండా 8 కేలో అప్డేట్ చేయించాడీ చిత్రాన్ని. అంతే కాదు.. రీ రిలీజ్ ను 3 డీలో చేయిస్తున్నాడు. అంటే ఓ హాలీవుడ్ రేంజ్ మూవీ చూస్తున్న అనుభూతి ఆడియన్స్ కు కలగడం ఖాయం. నిజానికి ఈ మూవీది హాలీవుడ్ రేంజే. అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి అలా తెలుగు వరకే ఆగిపోయింది కానీ... ఇది సిసలైన ప్యాన్ ఇండియా మూవీ. ఆ ఫీల్ ను ఈ రీ రిలీజ్ లో తీసుకు రావడానికే నాగ్ అశ్విన్ అంత కాస్ట్ లీ కేర్ తీసుకున్నాడు. మరి అతని కష్టం ఫలించి వసూళ్లు కూడా అలాగే ఉంటే హ్యాపీ. లేకపోయినా 20 యేళ్ల తర్వాత రీ రిలీజ్ చేసుకున్నా.. ఈ చిత్రానికి వచ్చిన ఇబ్బందేం లేదు. పైగా కొత్తగా శాటిలైట్ కూడా చేయించుకోవచ్చు. ఓటిటి అవకాశాలూ లేకపోలేదిప్పుడు. ఇవన్నీ ఆలోచించే నాగ్ అశ్విన్ ఈ స్టెప్ తీసుకున్నాడనుకోవచ్చు. మరి త్రీడీలో జగదేకవీరుడి విన్యాసాలు, అతిలోకసుందరి సోయగాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News