Jai Bagalaamukhii : తమ్ముడు నుంచి బగలాముఖి సాంగ్

Update: 2025-06-24 12:02 GMT

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం ‘తమ్ముడు’.దిల్ రాజు నిర్మాత. టైటిల్ చూసి చాలామంది ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ అంతకు మించి ఉండబోతోందని ఆ మధ్య విడుదల చేసిన బ్యాంగర్ ఆఫ్ తమ్ముడుతో అర్థమైంది. కాంతార రేంజ్ లో కంటెంట్ కనిపిస్తోంది అనే కామెంట్స్ వచ్చాయి. అది నిజమే అనిపించేలా తాజాగా ఈ చిత్రం నుంచి ‘జై బగలాముఖి’అనే పాటను విడుదల చేశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ పాటను జొన్నవిత్తుల రామలింగయ్య శాస్త్రి రాశాడు. అబ్బి వి పాడాడు.

గ్రామ దేవతలకు బోనాలు సమర్పించే సందర్భంలో వచ్చే పాటలా ఉంది. కాకపోతే కేవలం గ్రామ దేవతగానే కాక అంతకు మించి ఈ దేవత మహిమలు ఉంటాయేమో అనిపించేలా ఉంది సాహిత్యం. పిక్చరైజేషన్ సైతం కాంతారను గుర్తుకు తెస్తోంది. ఇలాంటి పాటలు రాయడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న జొన్నవిత్తుల ఆ భక్తి భావం ఉట్టి పడే సాహిత్యంతో ఆకట్టుకున్నాడు.

‘కొండకోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారీ.. గుండె గుండెలో అఖండ జ్యోతిగ వెలుగుచుండు ఓంకారి.. మంగళకారిణి మాలిని.. మమ్మేలవే మధుశాలినీ.. ’ అంటూ సాగే సాహిత్యం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంగీతం బావుంది. కాకపోతే పాడించే సందర్భంలో ‘ఓమ్ కారి’అనే స్థానంలో ‘ఓన్ కారి’అన్నట్టుగా వినిపించడం బాలేదు. మొత్తంగా ఈ చిత్రంపై రోజు రోజుకూ అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.

జూలై 4న విడుదల కాబోతోన్న తమ్ముడు మూవీ నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రంతో లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఫీమేల్ లీడ్స్ లో కాంతార ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక నటిస్తున్నారు.

Full View

Tags:    

Similar News