దేవర తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలీవుడ్ నటి జాన్వీకపూర్ హైదరాబాద్‌లోని మధురానగర్ పూజలు చేశారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. జాన్వీ కపూర్ అక్కడకు వచ్చిందనన్న సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.