Janhvi Kapoor : సోషల్ మీడియా అంటే భయం: జాన్వీ కపూర్

Update: 2024-08-03 06:12 GMT

సోషల్ మీడియా అంటే తనకు భయమని హీరోయిన్ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) తెలిపారు. అందుకే దానికి దూరంగా ఉంటానని చెప్పారు. ‘ఉలఝ్’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘రెడిట్‌లో వచ్చే ట్రోల్స్ గురించి నాకు అంతగా తెలియదు. ఆ ప్లాట్‌ఫామ్‌లో నన్ను ట్రోల్ చేస్తున్నారని నా చెల్లి ఖుషీ చెప్పింది. వాటిపై ఎలా స్పందించాలో కూడా నాకు తెలియదు. చాలా దారుణమైన ట్రోల్స్ ఉన్నా నేను వాటిని పట్టించుకోను’ అని ఆమె పేర్కొన్నారు.

" సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, కామెంట్స్​ను మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సామాజిక మాధ్యమాల కల్చరే అది. నువ్వు సెలబ్రిటీ అయినా, కాకపోయినా ఇటువంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆ కామెంట్స్‌ను అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనల్ని పొగిడిన వాళ్లే, రేపు తిడతారు. మనకు తెలియని వ్యక్తులు మనల్ని ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవటం ఎందుకు" అని జాన్వీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Tags:    

Similar News