Janhvi Kapoor : పింక్ లెహెంగాలో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్

Update: 2025-07-30 09:45 GMT

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులోనూ బిజీ అవుతోంది. అందం కంటే ఎక్కు వగా ప్రమోషన్ల పైనా ఫోకస్ చేస్తూ తన నటనకు ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ కలిసి 'పెద్ద' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు హోమ్ బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ జాన్వీ కనిపించనుంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యాషన్ వేదికలపై కూడా ట్రెండింగ్ గా మారింది. తాజాగా న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరు గుతున్న హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025లో తళుక్కున మెరిసింది. పింక్ కలర్ లెహెంగాలో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ, తన రాయల్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రెడిషనల్ డిజైస్ కు గ్లామర్ టచ్ జత చేస్తూ ఈ లుక్ లో తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. ఇన్స్టా వేదికగా జాన్వీ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా యి. క్లాస్, గ్లామర్ రెండింటి మిక్స్ లో ఈ అవుట్ ఫిట్ పై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ తన తల్లి శ్రీదేవిని గుర్తుచేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News