Janhvi Kapoor : పా. రంజిత్ తో జాన్వీ కపూర్

Update: 2025-02-14 10:00 GMT

కాంబినేషన్ కొత్తగా ఉంది కదూ. అసలెవరూ ఊహించి ఉండరు. పా. రంజిత్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. టార్చ్ బేరర్ లాంటి మూవీస్ తీస్తుంటాడతను. కొందరికి నచ్చకపోయినా తన సినిమాలతో తన పొలిటికల్ అజెండాను ప్రకటిస్తాను అని చెబుతుంటాడు అతను. ఆ కోణంలో అవి ఆకట్టుకుంటాయి. ఈ కంటెంట్ తో కమర్షియల్ సక్సెస్ లు కూడా చూస్తుంటాడు రంజిత్. మంచి స్టోరీ టెల్లర్ అని కూడా అనిపించుకున్నాడు. అందుకే రజినీకాంత్, విక్రమ్, ఆర్య లాంటి హీరోలు కూడా అతని డైరెక్షన్ లో సినిమాలు చేశారు. ఇంకా చాలామంది చేయాలని ఆశపడుతుంటారు. అయితే ఇదంతా కోలీవుడ్ వరకే అనుకున్నారు. బట్ తాజాగా జాన్వీ కపూర్ తో అతను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు అనే వార్త చాలామందిని ఆశ్చర్యపరిచింది.

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో పా. రంజిత్ డైరెక్షన్ లో నెట్ ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ నిర్మించబోతోంది. ఇప్పటి వరకూ జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ లో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఖచ్చితంగా పా. రంజిత్ మూవీ ఆమె కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ కు సమాధానం చెప్పేలా సిరీస్ ఉంటుందా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News